HomeOTTఈ వారంలో ఓటీటీ, ధియేటర్ చిత్రాలు

ఈ వారంలో ఓటీటీ, ధియేటర్ చిత్రాలు

ఈ జులైలో ఆసక్తికరమైన చిన్న చిత్రాలను విడుదల అయ్యాయి. చివర్లో సముద్రఖని దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ హీరో గా ‘బ్రో’ వచ్చి బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసింది. ఇప్పుడు ఆగస్టు నెల వంతు. మరి ఆగస్టు మొదటి వారంలో థియేటర్‌తో పాటు, ఓటీటీ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలు ఇవే !

ధోని ఎంటర్టైన్మెంట్స్ ‘ఎల్‌జీఎం’ చిత్రం:

LGM

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో తన మొదటి సినిమా ఎల్‌జిఎమ్‌ని నిర్మించాడు. తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగి బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వినోదభరితమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడిన ఎల్‌జిఎమ్‌కి రమేష్ తమిళమణి దర్శకత్వం వహించగా, సాక్షి ధోని మరియు వికాస్ హసిజా దీనిని ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై బ్యాంక్రోల్ చేశారు. ఈ సినిమా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

రాజుగారి కోడిపులావ్ చిత్రం:

Raju Gari Kodi Pulao

ఈ చిత్రంలో శివ కోన, ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాజుగారి కోడిపులావ్’ (Rajugari kodipulao). శివ కోన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 4న రానుంది. కుటుంబ ప్రేక్షకులను అలరించే కథతో సినిమాను తెరకెక్కించినట్లు దర్శకుడు, నిర్మాత శివ కోన చెబుతున్నారు.

విక్రమ్‌ రాథోడ్‌ చిత్రం:

Vikram Rathode

ఈ చిత్రంలో విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా బాబు యోగేశ్వరన్‌ తెరకెక్కించిన చిత్రం ‘విక్రమ్‌ రాథోడ్‌’ (Vikram Rathode). ఎస్‌.కౌశల్య రాణి నిర్మాత. సురేష్‌ గోపి, సోనూసూద్‌, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 4న థియేటర్‌లలో విడుదల కానుంది. 

 ‘మిస్టేక్‌’ చిత్రం:

Mistake

ఈ చిత్రంలో అభినవ్‌ సర్దార్‌ హీరోగా నటిస్తూ.. తానే నిర్మించిన చిత్రం ‘మిస్టేక్‌’ (Mistake). భరత్‌ కొమ్మాలపాటి దర్శకుడు. ఆగస్టు 4న ఈ సినిమా రానుంది. యాక్షన్‌, కామెడీ, సస్పెన్స్‌, థ్రిల్‌.. ఇలా అన్ని రకాల అంశాలు ఉన్న మూవీ మిస్టేక్‌ అని చిత్ర బృందం చెబుతోంది.

ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/సిరీస్‌లు

  • నెట్‌ఫ్లిక్స్‌
  • చూనా (హిందీ సిరీస్‌) ఆగస్టు 3
  • రంగబలి (Rangabali)) ఆగస్టు 4

Rangabali

  • ది హంట్‌ ఫర్‌ వీరప్పన్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌) ఆగస్టు 4
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • గార్డియన్స్‌ ఆఫ్‌ ది గెలాక్సీ 3 (హాలీవుడ్‌) ఆగస్టు 2

Guardians of the Galaxy Vol. 3

  • దయా (dayaa) (తెలుగు సిరీస్‌) ఆగస్టు 5

dayaa

  • సోనీలివ్‌
  • పరేషాన్‌ (pareshan) (తెలుగు) ఆగస్టు 4

pareshan

  • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • ధూమం (dhoomam) (కన్నడ, తెలుగు)

Dhoomam

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments