HomeReviewsసమీక్ష: ఖుషీ

సమీక్ష: ఖుషీ

సమీక్ష: ఖుషీ

విడుదల తేదీ: సెప్టెంబర్ 1, 2023

నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంతా రూత్ ప్రభు, జయరామ్, సచిన్ ఖేడాకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ మరియు శరణ్య ప్రదీప్

దర్శకుడు: శివ నిర్వాణ

నిర్మాతలు: నవీన్ యెర్నేని మరియు రవిశంకర్ వై

సంగీత దర్శకుడు: హేషమ్ అబ్దుల్ వహాబ్

సినిమాటోగ్రాఫర్: జి.మురళి

ఎడిటర్: ప్రవీణ్ పూడి

సంబంధిత లింకులు: ట్రైలర్

ఖుషీ 2023 తాజా చిత్రం అడుగులు. విజయ్ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రలు. ఈ చిత్రానికి శివ నిర్వాణ రచన మరియు దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ: విప్లవ్ (విజయ్ దేవరకొండ) ఆరాధ్య (సమంత)ను చూసి తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. అతన్ని దూరం పెట్టడానికి ఆరాధ్య ఎన్ని అబద్ధాలు చెప్పి తప్పించుకున్నా.. ఎట్టకేలకు చివరకు విప్లవ్ తో ఆమె కూడా ప్రేమలో పడుతుంది. అయితే వీరి ప్రేమకు ఆరాధ్య తండ్రి మరియు ప్రవచన కర్త చదరంగం శ్రీనివాసరావు (మురళీ శర్మ) అంగీకరించడు. అటు విప్లవ్ తండ్రి మరియు నాస్తికుడైన సత్యం (సచిన్ ఖేడేకర్) కూడా వీరి పెళ్లిని అంగీకరించడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో తల్లిదండ్రులను ఎదిరించి విప్లవ్ – ఆరాధ్య పెళ్లి చేసుకుంటారు. మరి పెళ్లి తర్వాత వీరి జీవితం ఎలా సాగింది ?, వీరి లైఫ్ లో జరిగిన ఊహించని మలుపులు ఏమిటి ?, చివరకు విప్లవ్ – ఆరాధ్య కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.

థంబ్స్ అప్:

  • విప్లవ్‌గా విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడు
  • స్టార్ నటి సమంత ఖుషీలో ఆమె చాలా అందంగా కనిపించింది మరియు చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది.
  • గుడ్ మ్యూజిక్ అండ్ రిచ్ విజువల్స్‌

బాగాలేదు:

  • సెకండ్ హాఫ్
  • రెగ్యులర్ సన్నివేశాలు
  • ఇంటర్వెల్ ముందు సన్నివేశాలు

విశ్లేషణ: ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. శివ నిర్వాణ దర్శకుడిగా మంచి కథాంశంతో ఆకట్టుకున్నాడు. అలాగే ఆయన టేకింగ్ కూడా చాలా బాగుంది. సంగీత దర్శకుడు హిషామ్ అబ్ధుల్ వహాబ్ అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో చాలా బాగుంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాతలు నవీన్ ఎర్నేని-వై.రవిశంకర్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు : ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంది. దర్శకుడు శివ నిర్వాణ నాస్తికత్వానికి – భక్తికి సంబంధించి మంచి పాయింట్ ను తీసుకుని.. భార్యాభర్తల మధ్య మంచి ఎమోషనల్ సన్నివేశాలతో బాగానే ఆకట్టుకున్నాడు. గుడ్ కాన్సెప్ట్, ఫీల్ గుడ్ లవ్ సీన్స్, ఎమోషనల్ గా సాగే ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాలో హైలైట్స్ గా నిలిచాయి. ఐతే, ఈ సినిమాలో కొన్ని సీక్వెన్స్ స్లోగా సాగడం, అలాగే కొన్ని రొటీన్ సీన్స్ సినిమాకి మైనస్ అయ్యాయి. కాకపోతే, విజయ్ దేవరకొండ – సమంత తమ నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకువెళ్లారు. ముఖ్యంగా వారిద్దరీ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఓవరాల్ గా ఈ ఖుషి ప్రేక్షకులను బాగా మెప్పిస్తోంది.

మూవీమొఘల్ రేటింగ్ : 2.75/5

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments