HomeGalleryముఖ్యగమనిక సినిమా సమీక్ష

ముఖ్యగమనిక సినిమా సమీక్ష

ముఖ్యగమనిక సినిమా సమీక్ష

క్రైం ఇన్వెస్టిగేటివ్ కథలకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన ఉంటుంది. సరైన స్టోరీ, స్క్రీన్ ప్లే తో క్రైం రేట్ ను తెరపై ఆవిష్కరి స్తే… బాక్సాఫీస్ వద్ద బొమ్మ హిట్టే. తాజాగా వేణు మురళీధర్. వి. ఇలాంటి కథనే ‘ముఖ్య గమనిక’ పేరుతో తెరకెక్కించారు.. ఇందులో అల్లు అర్జున్ కజిన్ … అంటే అల్లు అర్జున్ కి మేనమామ కొడుకు అయినటువంటి విరాన్ ముత్తంశెట్టి.. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రాజశేఖర్, సాయి కృష్ణ ఈ సినిమాని శివిన్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై సంయుక్తంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్ లతో ఆకట్టుకున్న ఈ చిత్రం మంచి బజ్ తో రిలీజ్ అయింది. మరి ఈ క్రైం థ్రిల్లర్ ప్రేక్షకుల్ని ఏమాత్రం థ్రిల్ కు గురిచేసిందో చూద్దాం పదండి.

కథ: విరాన్(విరాన్ ముత్తంశెట్టి) ఓ పోలీస్ ఆఫీసర్ కొడుకు. ఊహించని విధంగా అతని తండ్రి హత్యకు గురవుతాడు. దీంతో తండ్రి ఉద్యోగం విరాన్ కి వస్తుంది. అయితే విరాన్ తండ్రి మాత్రమే కాదు ఇంకా చాలా మంది పోలీసులు ఊహించని విధంగా హత్యకి గురవుతూ ఉంటారు. దీని వెనుక ఉన్న మిస్టరీని చేధించాలని విరాన్ డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో అతనికి తన తండ్రి చనిపోయిన రోజునే మిస్ అయిన ఓ ఆర్.జె.కేసు ఎదురవుతుంది. అతను ఎలా మిస్ అయ్యాడు? దాని వెనుక అతని భార్య హస్తం ఉందా? అసలు ఆర్.జె మిస్సింగ్ కేసుకి విరాన్ తండ్రి హత్యకి సంబంధం ఏంటి? చివరికి విరాన్ ఆ మర్డర్స్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించి హంతకుడిని పట్టుకున్నాడా? లేదా? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు ఎలా వుందంటే…

హీరో విరాన్ మంచి సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. నటుడిగా ఇంకా ఇంప్రూవ్ కావాలి. ఇది క్రైం థ్రిల్లర్ మూవీ కావడంతో .. ఇన్వెస్టిగేషన్ కోణంలో బాగానే చేశాడు. హీరోయిన్ లావణ్య సాహుకారకి తన పాత్రకి న్యాయం చేసింది. ఆర్.జె.రోల్ చేసిన నటుడు , అతని భార్యగా చేసిన ఆర్యన్ ఇప్పిల్లి బాగా నటించారు. వీరిద్దరికీ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ దొరికింది.ఎడిటింగ్ కాస్త బాగా చేయొచ్చు.సంగీతం కిరణ్ వెన్న పర్లేదు అనిపించాడు.నిర్మతలు ఉన్నవాటిలో చాలా బాగానే ఖర్చు పెట్టారు.సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ వేణు మురళీధర్ తొలి సినిమా అయినా చాలా బాగా చేసాడు అని చెప్పొచ్చు
అతను ఏంచుకున్న క్రైమ్ థ్రిల్లర్ చాలా సమయం లో కొత్త ట్విస్టులతో ఆద్యంతం మెప్పిస్తుంది.రెండు విభిన్న క్రైం ఎలిమెంట్స్ ను… ఒకే స్టోరీలో చెప్పి… మెప్పించారు. సంగీతం పర్వాలేదు.

యే అంచనలు లేకుండా ఒకసారి చూసేయండి.

రేటింగ్: 3/5

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments