HomeReviewsసమీక్ష: జవాన్

సమీక్ష: జవాన్

సమీక్ష: జవాన్

విడుదల తేదీ: సెప్టెంబర్ 7, 2023

నటీనటులు:  షారూఖ్ ఖాన్, విజయ్ సేతుపతి, నయనతార, దీపికా పదుకొనే, ప్రియమణి, సన్యా మల్హోత్రా, రిధి డోగ్రా, లెహర్ ఖాన్, సునీల్ గ్రోవర్, గిరిజా ఓక్

దర్శకుడు: అట్లీ

నిర్మాతలు: గౌరీ ఖాన్

సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రాఫర్: GK విష్ణు

ఎడిటర్:  రూబెన్

బ్యానర్: రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్

సంబంధిత లింకులు: ట్రైలర్

కథ : ఆజాద్ (షారుఖ్‌ ఖాన్) ఒక జైలర్. సమాజంలోని అన్యాయాలకు, అక్రమాలకు గురైన మహిళా ఖైదీలకు గైడ్ గా, మెంటర్ గా మారి.. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తాడు. అందుకు అనుగుణంగా తన టీమ్ తో కలిసి సంఘ విద్రోహ పనులు చేస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ సంఘటనలు ఏమిటి ?, మరోవైపు ఆజాద్ టీమ్ ను పట్టుకోవడానికి ఆఫీసర్ నర్మదా (నయనతార) టీమ్ చేసే ప్రయత్నం ఏమిటి ?, చివరికి ఆజాద్ టీమ్, నర్మదా నుంచి ఎలా తప్పించుకుంటుంది ?, అసలు ఆజాద్ ఎవరి కోసం ఇదంతా చేస్తున్నాడు ?, ఇంతకీ విక్రమ్ రాథోడ్ (షారుఖ్‌ ఖాన్) ఎవరు ?, విక్రమ్ రాథోడ్ గతం ఏమిటి ?, విక్రమ్ రాథోడ్ – ఆజాద్ మధ్య సంబంధం ఏమిటి ?, చివరకు ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.

అవినీతితో నిండిపోయిన వ్యవస్థపై ఒక హీరో చేసే పోరాటాలు వెండితెరపై చాలానే చూశాం. ఒక్కో సినిమాలో ఒక్కో సామాజిక సమస్యను చూపించారు కొందరు దర్శకులు. ఈ సినిమాలోనూ హీరో అవినీతి, సామాజిక సమస్యలపై పోరాడతాడు. అయితే, ఇప్పటి వరకు వెండితెరపై చూడని ఒక కొత్త అవినీతిని, కార్పోరేట్ మాఫియాను ఈ సినిమాలో చూపించారు దర్శకుడు అట్లీ. ఆర్మీకి ఎందుకూ పనికిరాని రైఫిల్స్‌ను సరఫరా చేస్తున్న ఒక కంపెనీపై తిరగబడిన జవాన్‌కు ఎలాంటి దుస్థితి పట్టిందనే విషయాన్ని వినోదభరితంగా, ట్విస్టులు ఇస్తూ చూపించారు. సినిమా మొత్తాన్ని తన రేసీ స్క్రీన్‌ప్లేతో పరిగెత్తించారు.

ముఖ్యంగా షారుఖ్ ఖాన్ అభిమానులకు ఈ సినిమా గూస్‌బంప్స్ ఇస్తుంది. అసలు హీరో ఇంట్రడక్షన్ ఫైటే అదిరిపోయింది. ఇప్పటి వరకు ఇలాంటి ఇంట్రడక్షన్ షారుఖ్ ఖాన్‌కు పడలేదనే చెప్పాలి. ఏ బాలీవుడ్ దర్శకుడు చూపించనంత మాస్ ఎలివేషన్స్‌తో షారుఖ్‌ను చూపించారు అట్లీ. సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే స్క్రీన్‌ప్లే ఊపందుకుంది. ట్రైలర్‌లో చూపించిన మెట్రో ట్రైన్ హైజాక్ సీన్‌తో అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి మొదలు ఇంటర్వల్ వరకు ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు కిక్ ఇస్తుంది. ముఖ్యంగా ఇంటర్వల్ బ్యాంగ్ ట్విస్ట్ మామూలుగా ఉండదు. ఇంటర్వల్ సీన్‌లోనే కథపై ప్రేక్షకుడికి ఒక క్లారిటీ వస్తుంది.

సాంకేతిక విభాగం : టెక్నికల్ గా చూసుకుంటే జవాన్ సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు అట్లీ తన రచనతోనూ దర్శకత్వంతోనూ ఆకట్టుకున్నారు. ఐతే, ఉత్కంఠభరితమైన కథనాన్ని ఇంకా ఎఫెక్టివ్ రాసుకుని ఉండి ఉంటే సినిమా ఇంకా బాగుండేది.

మూవీమొఘల్ రేటింగ్ :3/5

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments