HomeGallery‘పిండం’ సినిమా సమీక్ష

‘పిండం’ సినిమా సమీక్ష

‘పిండం’ సినిమా సమీక్ష

తెలుగు అబ్బాయ్ శ్రీరామ్ ఒకరికొకరు రోజా పూలు సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తరవాత రోబో శంకర్ డైరెక్షన్ లో వచ్చిన త్రీ ఇడియట్స్ రీమేక్ స్నేహితులు లో నటించి మెప్పించాడు. ఇప్పుడు తాజాగా ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక… ఇందులో నటించాడు. ఇందులో ఖుషీ రవి హీరోయిన్. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అయ్యారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ది స్కేరియస్ట్ ఫిల్మ్ గా ప్రచారం చేసిన… ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం భయపెట్టిందో చూద్దాం పదండి.

కథ: ఆంటోని(శ్రీరామ్) సుక్లామెట్ అనే వూళ్ళో ఓ రైస్ మిల్ లో చిరుద్యోగి. అతనికి భార్య మేరీ(ఖుషీ రవి), ఇద్దరు పిల్లలు ఉంటారు. బ్యాంకులో వేలానికి వచ్చిన ఓ ఇంటిని కొనుగోలు చేసి… అందులో నివాసం ఉంటారు. అయితే అందులో కొన్ని శక్తులు ఆంటోని కూతురు తారాని కొన్ని శక్తులు వేధిస్తుంటాయి. ఈ క్రమంలో కుటుంబాన్ని మొత్తాన్ని ఆ భవనంలోని కొన్ని ఆత్మలు వేధించడం మొదలు పెడతాయి. ఆంటోని తల్లి కూడా ప్రాణాలు కోల్పోతుంది. ఇలా వేధిస్తున్న ఆత్మల నుంచి ఆంటటోని కుటుంబం ఎలా బయట పడింది. అందుకు సహకరించిన వారెవరు? అసలు ఆ ఆత్మలు ఎవరివి? ఎందుకు ఆ బంగళాలో ఉన్నాయి? తదితర వివరాలు తెలియాలంటే సినిమాని చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: హారర్ జోనర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంది. సరైన స్టోరీ, స్క్రీన్ ప్లేతో గ్రిప్పింగ్ నెరేషన్ తో హారర్ సినిమాని తెరమీద చూపించ గలిగితే… ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టే. అందుకే కొత్త దర్శకలు, నిర్మాతలు ఇలాంటి హారర్ బేస్డ్ సినిమాలను సెల్యులాయిడ్ పై ఆవిష్కరించి బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నారు. తాజాగా కొత్త దర్శకుడు సాయికిరణ్ దైదా కూడా ఓ వైవిధ్యమైన హారర్ కథను ఎంచుకుని… దాని కోసం రాసుకున్న కథనం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అతీంద్రియ శక్తులతో ఆత్మలను కంట్రోల్ చేయొచ్చనే దాన్ని ఇందులో ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. గతంలో వచ్చిన అరుంధతి, మసూద సినిమాల్లో ఎలాగైతే దైవ శక్తులను నమ్ముకుని ఆత్మలకు కళ్లెం వేయొచ్చనేది చూపించారో… అలాగే ఇందులో కూడా అలాంటి సన్ని వేశాలతో సినిమాని ఆద్యంతం ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి సినిమాని చూసేలా చేశాడు దర్శకుడు. ముఖ్యంగా తార పాత్రలో నటించిన బేబి చిన్నారి పాత్ర బాగా ఆకట్టుకుంటుంది. చిన్నారి రెండు వేరియషన్స్ వున్న పాత్రను దర్శకుడు ఎంతో హృద్యంగా మలిచాడు. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఓ కుటుంబం ఎంత దారుణంగా ఆ కటుంబ యజమాని చేతిలో బలైందనేది ఆడపిల్లల భ్రూణ హత్యల మీద ఓ చిన్నపాటి మెసేజ్ కూడా ఇచ్చాడు దర్శకుడు. చిత్ర దర్శకుడు చెప్పినట్టు… ఈ చిత్ర టైటిల్ చాలా యాప్ట్ గా ఉంది. ‘చావు పుట్టుకల్లో ‘‘పిండం’’ ఉంటుంది. మనిషి జన్మించడానికి ముందు ‘‘పిండం’’ రూపంలో ఉంటాడు. అలాగే మరణించిన తర్వాత ‘‘పిండం’’ పెడతాము అని చెప్పారు. పైగా ఈ సినిమా కథ కూడా పిండం అనే టైటిల్ కి ముడిపడి ఉంటుందని… ఈ కథకి ఆ టైటిల్ సరిగ్గా సరిపోతుందని’ అందుకే ఆ టైటిల్ ఎంచుకున్నట్టు దర్శకుడు చెప్పిన విషయం తెలిసిందే.

చాలా కాలం తరువాత శ్రీరామ్ కి ఓ మంచి సినిమాలో తనేంటో ప్రూవ్ చేసుకునేందుకు అవకాశం కలిగింది. తెలుగు వాడైనా… తమిళంలో రాణిస్తున్న శ్రీరామ్… అప్పుడప్పుడు మాత్రమే తెలుగు సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. పిండం సినిమాలో మళ్లీ కనిపించి మెప్పించాడు. 90వ దశకంలో హీరోలు ఎలా ఉంటారో… అచ్చం అలాగే కనిపించి మెప్పించారు. అతనికి జోడీగా నటించిన కన్నడ బ్యూటీ ఖుషీ రవి… మేరీ పాత్రలో గర్భిణిగా కనిపించి ఆకట్టుకుంది. వీరి సంతానంగా నటించిన ఇద్దరు చిన్నారులు కూడా చక్కగా నటించారు. అతీంద్రీయ శక్తులతో ఆత్మలను కంట్రోల్ చేయొచ్చనే పాత్రలో ఈశ్వరీరావు నటించారు. ఒకరకంగా సినిమాని మొత్తం ఆమెనే లీడ్ చేశారని చెప్పొచ్చు. చాలా కాలం తరువాత ఇలాంటి పాత్రను తెలుగులో చూశాం. ఆమె శిష్యుడిగా అవసరాల శ్రీనివాస్ నటించారు. ఫ్లాష్ బ్యాక్ లో నటించిన సీరియల్ నటుడు కూడా క్రూరంగా కనిపించి మెప్పించాడు.

దర్శకుడు ఎంచుకున్న కథ… కథనాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. హారర్ జోనర్ లో ఇది స్కేరియస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చాలా చోట్ల దర్శకుడు భయపెట్టారు. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం కూడా చాలా ప్లస్ అయింది. హారర్ సినిమాలకు బీజీఎం యో ప్రధాన బలం కాబట్టి… అందులో దర్శకుడు తనకు కావాల్సినంత రాబట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని ఎంతో క్వాలిటీగా నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఈ జోనర్ ఇష్టపడే వాళ్ళు ఓ సారి చూడొచ్చు.

భయ పెట్టే ‘పిండం’

రేటింగ్: 3/5

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments