HomeIndustry news‘జోరుగా హుషారుగా’ సినిమా సమీక్ష

‘జోరుగా హుషారుగా’ సినిమా సమీక్ష

‘జోరుగా హుషారుగా’ సినిమా సమీక్ష

‘బేబి’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన… యూత్ లో మంచి క్రేజ్ వున్న న‌టుడిగా గుర్తింపు పొందిన యువ హీరో విరాజ్ అశ్విన్… తాజాగా హీరోగా నటించిన చిత్రం ‘జోరుగా హుషారుగా’. ఇందులో పూజిత పొన్నాడ క‌థానాయిక‌. ఈ చిత్రానికి అను ప్ర‌సాద్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాని శిఖ‌ర అండ్ అక్ష‌ర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ ప‌తాకంపై నిరీష్ తిరువిధుల నిర్మించారు. యూత్‌ఫుల్ అండ్ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి.

కథ: పోచంపల్లి అనే గ్రామంలో ఓ చేనేత కుటుంబంలో పుట్టిన సంతోష్ (విరాజ్ అశ్విన్) ఉన్నత విద్య కోసం లండన్ వెల్లాలనుకుంటాడు. అయితే ఓ ఇన్సిడెంట్ వల్ల హైదరాబాద్ లో ఓ సాప్ట్ వేర్ కంపెనీలో చేరుతాడు. అదేకంపెనీలో తన ప్రేయసి నిత్య (పూజిత పొన్నాడ) కూడా టీమ్ లీడర్ గా చేరుతుంది. అయితే ఆ కంపెనీ ఓనర్ ఆనంద్ (మధు నందన్) నిత్యను ప్రేమిస్తున్నట్టు సంతోష్ తో చెబుతాడు. అయితే ఆనంద్ ను… అదే సంస్థలో పనిచేసే సుచిత్ర జోసెఫ్ (సిరి హనుమంత్) ఆనంద్ ను ప్రేమిస్తూ ఉంటుంది. మరి ఈ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ చివరికి ఎలాంటి మలుపు తిరిగింది? సంతోష్, నిత్య ఒక్కతయ్యరా? లండన్ వెళ్లాల్సిన సంతోష్ హైదరాబాద్ లో ఎందుకు ఉద్యోగం చేయాల్సి వచ్చింది? తదితర వివరాలు మీకు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఏలా వుందంటే…

బేబీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం అంటే యూత్ లో ఎంతో ఆసక్తి నెలకొంది. బేబీ సినిమాలో లాగే వుంటుందనే అందరూ అనుకున్నారు. కానీ టీమ్ ప్రమోషన్స్ లో మాత్రం.. ఈ చిత్రం బేబీలో విరాజ్ అశ్విన్ పాత్రకి ఇది పూర్తిగా కాంట్రాస్ట్ వుంటుందని చెబుతూ వ్వచింది. చిత్ర దర్శకుడు అయితే విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డి తరవాత గీతా గోవిందం ఎలాగో… విరాజ్ కి బేబీ తరవాత జోరుగా హుషారుగా అలా అని చెప్పారు. దర్శకుడు చెప్పినట్టు ఈ సినిమా నిజంగా అలానే వుంది విరాజ్ కి. ఓ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఓ అబ్బాయి కుటుంబం పరువుకోసం, తన తండ్రి ప్రేమను పొందడం కోసం తపన పడే యువకుని పాత్రను దర్శకుడు తీర్చి దిద్దిన విధానం ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది.

ఫస్ట్ హాఫ్ లో తనను ప్రేమించిన అమ్మాయితో సరదాగా సాగే సన్నవేశాలు, ఐటీ కంపెనీలో తోటి స్నేహితులతో, కంపెనీ యజమానితో సరదాగా సాగే క్లీన్ కామెడీ సన్నవేశాలతో ఆడియెన్స్ ను ఎంగేజ్ చేసిన దర్శకుడు ద్వితీయార్థంలో మాత్రం ట్రై యాంగిల్ లవ్ ట్విస్ట్ తో మరింత కామెడీని పండించాడు. అలాగే తండ్రి కొడుకుల మధ్య వున్న ఎమోషన్స్ ను చూపించి కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఇలా జోరుగా హుషారుగా సినిమా ను యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు.

విరాజ్ అశ్విన్ పాత్ర చాలా కూల్ గా… క్లీన్ గా ఇందులో వుంది. యూత్ కే కాదు… ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా నచ్చేలా ఇందులో నటించారు. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా ఉంటారో అలా వున్నాడు ఆ పాత్రలో. అతనికి జంటగా నటించిన పూజిత పొన్నాడ కూడా టీమ్ లీడర్ పాత్రలో, విరాజ్ లవర్ గానూ, మరోవైపు కంపెనీ యజమాని ప్రేమిస్తున్నా అని వెంటపడుతుంటే… ఆ టార్చర్ ను ప్రియుడి కోసం కామ్ గా భరించే అమ్మయి పాత్రలో ఒదిగిపోయింది. సాప్ట్ వేర్ కంపెనీ యజమానిగా, ఏజ్ బార్ అయినా పెళ్ళి కాని ఆనంద్ గా మధు నందన్ బాగా నవ్వించాడు. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన అతను తన కామెడీ డైలాగులతో నవ్వించారు. చివరలో వచ్చే బ్రహ్మాజీ చర్చి ఫాదర్ గా కాసేపు వున్నా నవ్వించాడు. సిరి అనుమంత్… సాయి కుమార్, రోహిణీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

దర్శకుడు రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే క్లీన్ గా వున్నాయి. విరాజ్ పాత్రని చక్కగా చూపించారు. సంగీతం. పర్వాలేదు. ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా వుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. హీరో, హీరోయిన్ జంటని అందంగా చూపించారు. నిర్మాత ఖర్చుకి వెనుకాడకుండా సినిమాని చాలా క్వాలిటీగా నిర్మించారు. సో.. గో అండ్ వాచ్ ఇట్.

రేటింగ్: 3/5

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments