Homeఇండస్ట్రీ న్యూస్#NC23 ఎక్స్‌పెడిషన్, ది ఫస్ట్ కట్ డాక్యుమెంటేషన్

#NC23 ఎక్స్‌పెడిషన్, ది ఫస్ట్ కట్ డాక్యుమెంటేషన్

యదార్థ సంఘటనల ఆధారంగా, రియల్ లొకేషన్‌లలో రూపొందించే చిత్రాలకు ప్రీ-ప్రొడక్షన్ చాలా ముఖ్యం. నాగ చైతన్య 23వ చిత్రానికి చందూ మొండేటి  దర్శకత్వం వహిస్తున్నారు. లెజెండరీ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అందుకోసం కొత్త విధానాన్ని అనుసరించారు. ప్రీ-ప్రొడక్షన్‌ను ప్రారంభించడానికి,  #NC23 టీం కోస్టల్  ఆంధ్రప్రదేశ్ పర్యటించింది. శ్రీకాకుళంలోని కె.మత్స్యలేశం గ్రామాన్ని సందర్శించింది.

నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌లో కూర్చొని ఈ కథను  రూపొందిచడం కాదని దర్శకుడు భావించారు. నేరుగా ఇక్కడికి వచ్చి ఇక్కడి  ప్రజలు, వాతావరణాన్ని అధ్యయనం చేస్తూ చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రీ ప్రొడక్షన్‌ను ముందుకు తీసుకెళ్తున్నాం’ అన్నారు

దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ.. ‘‘ఈ గ్రామానికి వచ్చి ప్రతి అంశానికి సంబంధించిన వివరాలను పరిశీలించిన తర్వాత మా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ స్టార్ట్ అయ్యింది ’’ అన్నారు.

హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. ‘‘ పాత్రలన్నిటిని కలసి, వారి బాడీ లాంగ్వేజ్‌, పల్లె పరిస్థితులు, వారి జీవనశైలిని అర్ధం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం’’ అన్నారు.

దీన్ని నెక్స్ట్ లెవల్ కి  తీసుకువెళ్లి, మత్స్యకారుల వర్క్ లైఫ్ ని అర్థం చేసుకోవడానికి #NC23 టీం  సముద్రంలోకి వెళ్లింది.
ఈ మొత్తం ప్రయాణాన్ని ది ఫస్ట్ కట్ డాక్యుమెంటేషన్ అనే డాక్యుమెంటరీగా ప్రజంట్ చేశారు. ఇది ఒక ఎక్సయిటింగ్ జర్నీ అని చెప్పాలి

టాలీవుడ్‌లో మునుపెన్నడూ లేని విధంగా, ఒక హీరో షూటింగ్ ప్రారంభించే ముందు లొకేషన్‌లను సందర్శించి ప్రజలతో మాట్లాడారు. నాగ చైతన్య ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పాల్గొంటూ ప్రాజెక్ట్ పై తన ప్రత్యేక ఆసక్తిని చూపిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments