HomeGalleryకృష్ణమ్మ సినిమా సమీక్ష

కృష్ణమ్మ సినిమా సమీక్ష

కృష్ణమ్మ… ముగ్గురు స్నేహితుల కథ

విజయవాడ బేస్ చేసుకుని చాలా కథలు వెండితెరపై ఆవిష్కరించబడినాయి. అయితే అవన్నీ కూడా బెజవాడ రౌడీయిజం బేస్ చేసుకుని రాసుకున్న కథలే. ఇందులో కొన్ని అలరించాయి… కొన్ని నిరాశ పరిచాయి. అయితే కృష్ణమ్మ మాత్రం వీటికి చాలా డిఫరెంట్ అని చిత్ర యూనిట్ చెప్పింది. మరి ఈ కృష్ణమ్మ సినిమాలో వర్స్ టైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటించగా… అతని స్నేహితులుగా మీసాల లక్ష్మణ్,కృష్ణ తేజ నటించారు.. అథిరా రాజ్, అర్చన, నందగోపాల్, , రఘు కుంచె తదితరులు నటించారు. డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించిన ఈ చిత్రానికి వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు..ఎమోషనల్ రివెంజ్ స్టోరీ నేపథ్యంలో… రా అండ్ రస్టిక్ గా తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ రివేంజ్ డ్రామా ఆడియెన్స్ ను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

స్టోరీ: విజయవాడ వించిపేటలో భద్ర (సత్యదేవ్), కోటి(లక్ష్మణ్ మీసాల), శివ(కృష్ణతేజ) అనే ముగ్గురు స్నేహితులు చిన్నప్పట్నుంచి పెరిగి పెద్ద అవుతారు. వించిపేట మనుషులు డబ్బులిస్తే వేరే వాళ్ళ కేసులను తమ మీద వేసుకొని వెళ్తుంటారు. వించిపేట ఏరియాలో ఉండే దాసన్న దగ్గర గంజాయి తీసుకురావడం లాంటి కొన్ని క్రిమినల్ పనులు చేసి భద్ర, కోటి బతుకుతుంటారు. శివ మాత్రం ఓ ప్రింటింగ్ షాప్ పెట్టుకొని వీళ్ళని కూడా మార్చాలనుకుంటాడు. ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు ఈ ముగ్గురు. అలాంటి సమయంలో శివ లైఫ్ లోకి మీనా(అథిరా రాజ్) వస్తుంది. శివ, మీనా ప్రేమలో పడటం, భద్రకి రాఖీ కట్టి అన్నయ్య అని పిలవడంతో తనకి కూడా ఓ ఫ్యామిలీ వచ్చిందని సంతోషిస్తాడు. ఇలా హ్యాపీగా లైఫ్ సాగిపోతున్న టైంలో మీనాకు ఓ కష్టం వస్తుంది. అదే టైంలో భద్ర, శివ, కోటిలను ఓ కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తారు. మీనాకు వచ్చిన కష్టం ఏంటి? ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ని ఏ కేసులో అరెస్ట్ చేసారు? వీళ్ళని కేసులో ఎవరు ఇరికిస్తారు? వీళ్ళకి ఒక ఫ్యామిలీ ఏర్పడిందా? అనేవి తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే.

సినిమా ఎలా వుందంటే…

గతంలో చేయని నేరానికి శిక్ష పడే కథలు గతంలో పలు సినిమాల్లో చూపించినా ఈ సినిమాలో స్నేహం, ఫ్యామిలీ ఎమోషన్ చుట్టూ కథ కథనాలు రాసుకున్నారు దర్శకుడు. విజయవాడ కృష్ణా నది తీరాన ఈ సినిమా తెరకెక్కించారు. కృష్ణా నది ఎక్కడో పుట్టి మలుపులు తిరుగుతూ వెళ్తుంది. అలాగే కృష్ణమ్మ సినిమాలో ఎక్కడ ఎవరికీ పుట్టారో తెలియని ముగ్గురి ఫ్రెండ్స్ జీవితం ఎలా మలుపులు తిరిగింది అన్నట్టు టైటిల్ కి తగ్గట్టు కథ నడిపించారు. ముగ్గురు అనాథలను స్నేహితులుగా తీసుకొని స్నేహం, ఫ్యామిలీ ఎమోషన్స్ ని బాగా పండించారు. ఇంటర్వెల్ కి ఓ ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏంటి అనే ఓ ఆసక్తి నెలకొల్పారు. కృష్ణమ్మ సినిమా ఎమోషన్స్ తో కూడిన ఓ రివెంజ్ స్టోరీని రా & రస్టిక్ గా తెరకెక్కించారు. క్లైమాక్స్ లాస్ట్ సీన్ ఆశ్చర్యపోవాల్సిందే. మాస్ ను బాగా అలరిస్తుంది. దశాబ్దన్నర క్రితం విజయవాడలో జరిగిన ఓ దారుణ సంఘటన బేస్ చేసుకుని సినిమాని తెరకెక్కించినట్టు కనిపిస్తుంది. క్రైం డ్రామా కాబట్టి నచ్చుతుంది.

పాత్ర ఎదైనా అవలీలగా చేయగలిగే నటుల్లో సత్యదేవ్ ఒకరు. ఈ సినిమాతో మరోసారి సత్యదేవ్ తన నటనతో మెప్పించాడు. వించిపేట భద్రగా సత్యదేవ్ అదరగొట్టేసాడు. ఫ్రెండ్స్ పాత్రల్లో లక్ష్మణ్ మీసాల, కృష్ణ తేజ బాగా పోటీ పడి నటించారు. మలయాళీ అమ్మాయి అథిరా రాజ్… మీనా అనే తెలుగమ్మాయిలా నటించి మెప్పించింది. హోమ్లీ గా కనిపించింది. సత్యదేవ్ పక్కన అర్చన అయ్యర్ పాత్ర పర్వాలేదు. పోలీసాఫీసర్స్ గా నందగోపాల్ బాగా ఆకట్టుకున్నాడు. ఇతని నటన ఆశిష్ విద్యార్థి నటనను పోలి ఉంటుంది. క్రైం ఇన్వెస్టి గేశన్ ఆఫీసర్ గా రఘు కుంచె నటించారు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు.

కృష్ణమ్మ… ముందుగా చెప్పినట్టు చాలా వరకు విజయవాడ, చుట్టుపక్కల ప్రాంతాల్లోనే షూట్ చేయడంతో… బెజవాడ లొకేషన్స్ ని చాలా బాగా చూపించారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. కాలభైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు పాటలకు ఇచ్చిన సంగీతం మెప్పించింది. కథనం కొత్తగా రాసుకొని దర్శకుడిగా గోపాలకృష్ణ సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా సినిమా క్వాలిటీ చూస్తుంటే ఖర్చు బాగానే పెట్టారు అని తెలుస్తుంది. ఎడిటింగ్ కూడా గ్రిప్పింగ్ గా వుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మాస్ ఆడియెన్స్ ను “కృష్ణమ్మ” అలరిస్తుంది. ఓ సారి సరదాగా చూసేయండి.

రేటింగ్: 3/5

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments