HomeReviewsసమీక్ష : “మ్యాడ్”

సమీక్ష : “మ్యాడ్”

సమీక్ష : “మ్యాడ్”

విడుదల తేదీ : అక్టోబరు 06, 2023

నటీనటులు: నార్నే నవీన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియ, ఆనంతిక, గోపిక ఉదయన్, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, విష్ణు ఆంటోనీ, శ్రీకాంత్ రెడ్డి తదితరులు

దర్శకుడు : కళ్యాణ్ శంకర్

నిర్మాతలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్

సంగీతం: భీమ్స్

సినిమాటోగ్రఫీ: షామ్ దత్, దినేష్ క్రిష్ణన్

ఎడిటర్: నవీన్ నూలి

సంబంధిత లింక్స్:  ట్రైలర్

 

లేటెస్ట్ గా టాలీవుడ్ లో యూత్ లో అయితే మంచి బజ్ ని రేపి రిలీజ్ కి వచ్చిన చిత్రమే “మ్యాడ్”. జూ. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయం అవుతూ దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతమేర ఆకట్టుకుందో సమీక్ష లో చూద్దాం రండి.

 

కథ : ఇక కథలోకి వస్తే.. (అశోక్)నార్నే నితిన్, సంగీత్ శోభన్(డిడి అలియాస్ దామోదర్) అలాగే మనోజ్(రామ్ నితిన్) ఈ ముగ్గురు కూడా ఓ ఇంజినీరింగ్ కాలేజ్ అండ్ హాస్టల్ మేట్స్ కాగా ఈ ముగ్గురు లైఫ్ లో అలాగే వారి కాలేజ్ లైఫ్ లో జరిగే ఫన్ ఇన్సిడెంట్స్ ఏంటి? జెన్నీ(ఆనంతిక) శృతి(గౌరీ ప్రియ) ల పాత్రలు ఏంటి? వీరందరి జర్నీ ఎలా సాగింది అనేది తెలియాలి అంటే ఈ మ్యాడ్ రైడ్ థియేటర్స్ లో చూడాల్సిందే.

 

థంబ్స్ అప్: ఈ సినిమాలో మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఆ ఫన్ ఎలిమెంట్స్ కోసం అని చెప్పాలి. జెనరల్ గా ఓ ముగ్గురు ఫ్రెండ్స్ కలిస్తే వచ్చే ఆ ఇన్స్టంట్ కామెడీ సాలిడ్ గా ఈ సినిమాలో వర్కవుట్ అయ్యింది అని చెప్పాలి. చాలా ఎపిసోడ్స్ అయితే మంచి ఫన్ ని జెనరేట్ చేస్తాయి. అలాగే గర్ల్స్ హాస్టల్ ఎపిసోడ్ కానీ క్లైమాక్స్ లో ఓ కామెడీ పోర్షన్ అయితే మరింత క్రేజీ అండ్ హైలైట్ అని చెప్పొచ్చు.

ఇలా కొన్ని చోట్ల అలా మంచి స్ట్రైకింగ్ కామెడీతో సినిమా మంచి ఫన్ మోడ్ లో మెయిన్ గా యూత్ ని ఆకట్టుకునే విధంగా కొనసాగుతుంది. ఇక నటీనటుల్లో అయితే ముగ్గురు ఫ్రెండ్స్ గా కనిపించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్ ఇంకా రామ్ నితిన్ ఎవరూ తగ్గలేదు. అందరూ మంచి పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు.

నార్నే నితిన్ అయితే డీసెంట్ లుక్స్ అండ్ నీట్ పెర్ఫార్మన్స్ ని కనబరిచాడు అలాగే తన డాన్స్ అండ్ యాక్షన్ బాగుంది. ఇక సినిమాలో సంగీత్ శోభన్ తన ఈజ్ కామెడీ టైమింగ్ తో ఇంప్రెస్ చేస్తాడు అలానే రామ్ నితిన్ తన మంచి హ్యాండ్సమ్ లుక్ లో కనిపించి డీసెంట్ పెర్ఫార్మన్స్ కనబరిచాడు. ఇక వీరికి జంటగా కనిపించిన హీరోయిన్స్ ఇంకా ఇతర కమెడియన్స్ నటుడు రఘుబాబు తదితరులు మంచి పెర్ఫార్మన్స్ లను డెలివర్ చేశారు.

 

బాగాలేదు: ఈ చిత్రంలో కామెడీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది అనేది చెప్పడం కొంచెం కష్టం. ఉన్నంతవరకు కామెడీ బాగానే ఉంది కానీ ఆల్రెడీ మనకి తెలిసిందే చూస్తున్నాం అన్నట్టు అనిపిస్తుంది. అలాగే మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే కొన్ని సీన్స్ అండ్ లాజిక్స్ బాగా సిల్లీగా ఉంటాయి. ఇవి అందరికీ ఎక్కకపోవచ్చు.

వీటితో పాటుగా అనుదీప్ పై ఇంకా మంచి కామెడీ సీన్స్ ని ఏమన్నా పెడితే మరింత హిలేరియోస్ ఫన్ జెనరేట్ అయ్యేది. వీటిని పక్కన పెడితే అసలు సినిమాలో ఒక కథాంశం అనేది ఏది లేదు. జస్ట్ ఒక కాలేజ్ హాస్టల్, ముగ్గురు హీరోలు హీరోయిన్స్ తప్ప ఇంకేమి లేదు. దీనితో కొంచెం కొత్త కథాంశం లాంటిది కోరుకునే వారికి ఇది డిజప్పాయింటింగ్ గా అనిపించవచ్చు.

 

సాంకేతిక విభాగం : ఈ చిత్రంలో మేకర్స్ పెట్టిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కించి అందించారు. ఇక టెక్నీకల్ టీం లో భీమ్స్ మ్యూజిక్ బాగుంది. తన మార్క్ ఫోక్ సాంగ్స్ యూత్ సాంగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ డైలాగ్స్ బాగున్నాయి.

ఇక దర్శకుడు కళ్యాణ్ శంకర్ విషయానికి వస్తే.. తాను కొత్త కథ, కథాంశాలు ఏమి ఎంచుకోలేదు కానీ యూత్ కి కావాల్సిన ఓ ఎంటర్టైనర్ ని ఇవ్వడంలో మాత్రం సక్సెస్ అయ్యారు అని చెప్పొచ్చు. కొన్ని కామెడీ ట్రాక్స్ సాలిడ్ గా ప్రెజెంట్ చేసాడు. కాకపోతే ఇంకా కొంచెం ఫ్రెష్ కామెడీ కంటెట్ ట్రై చేయాల్సింది.

 

తీర్పు : ఇక మొత్తంగా చూసినట్టు అయితే.. ఈ సినిమా పేరు “మ్యాడ్” కి తగ్గట్టుగానే ఒక క్రేజీ ఫన్ రైడ్ ని ఓ ఎంటర్టైనర్ కావాలి అని కోరుకునేవారికి అందిస్తుంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్ మరియు రామ్ నితిన్ లు మంచి నటన కనబరిచారు. రొటీన్ కథాంశం, కొన్ని సీన్స్ పక్కన పెడితే ఈ చిత్రం ఈ వారంతానికి డీసెంట్ ఎంటర్టైన్ చేస్తుంది.

మూవీమొఘల్ రేటింగ్ : 3/5

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments