HomeReviews‘మా ఆవారా జిందగీ’ మూవీ రివ్యూ

‘మా ఆవారా జిందగీ’ మూవీ రివ్యూ

ప్రస్తుతం యూత్‌ను అట్రాక్ట్ చేసే సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా ఆడేస్తున్నాయి. అయితే యూత్‌ను టార్గెట్ చేస్తూ వచ్చే అడల్ట్ కామెడీ సినిమాలు తక్కువగా వస్తుంటాయి. ఇప్పుడు అదే జానర్‌లో బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్ నటించిన మా ఆవారా జిందగీ అనే సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియెన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో రివ్యూలో చూద్దాం.

కథ ఏంటంటే?
భట్టి (శ్రీహాన్), సీబీ (జబర్దస్త్ అజయ్), చెర్రీ (ఎల్బీ), జస్వంత్ (లంబు) నలుగురు కుర్రాళ్లు పనీపాట లేకుండా ఖాళీగా, అవారాగా తిరుగుతుంటారు. ఎప్పుడూ తాగడం, జల్సాలు చేయడమే వీరి పని. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటారు. ఎస్సై రెడ్డి (షియాజీ షిండే) ప్రతీ సారి వీరికి వార్నింగ్ ఇస్తూనే ఉంటాడు. ఎస్సై కూతురు కిడ్నాప్‌కు గురవుతుంది. కిడ్నాప్ చేసింది ఎవరు? ఆ కిడ్నాప్‌లో ఆ నలుగురి ప్రమేయం ఉందా? చివరకు ఆ నలుగురు చేసిన పనులేంటి? అనేది థియేటర్లో చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే?..
శ్రీహాన్, అజయ్, చెర్రీ, జస్వంత్‌లు అల్లరి చిల్లరగా కనిపించే యువకుల పాత్రలో చక్కగా నటించారు. వీరు నలుగురు కలిసి చేసిన కామెడీ బాగానే వర్కౌట్ అయింది. హీరోయిజాలు చూపిస్తూ తెగ యాక్షన్ సీక్వెన్సులు చూపించే కారెక్టర్లు కాకపోవడంతో మరింత ఈజీగా నటించేశారు. ఆ నలుగురి కామెడీ సినిమాకు హైలెట్ అవుతుంది. ఇక షియాజీ షిండే పాత్ర కూడా బాగానే ఉంది. అయితే ఆ పాత్రకు డబ్బింగ్ మాత్రం అంతగా సూట్ అయినట్టు కనిపించదు. మిగిలిన పాత్రలు తమ పరిధి మేరకు మెప్పిస్తాయి.

ఎలా ఉందంటే?
ఈ మధ్య కామెడీ అడల్ట్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. యూత్‌ను టార్గెట్ చేస్తూ తీస్తోన్న ఈ సినిమాలు బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీలో అయితే ఇలాంటి సినిమాలకు కొదవే లేకుండాపోతోంది. ఓటీటీలో అడల్ట్ జానర్లు బాగానే క్లిక్ అవుతుంటాయి. ఆవారా జిందగీ అటువంటి జానర్‌లోకే వస్తుంది. ఈ సినిమాలో కామెడీతో పాటు అడల్ట్ కంటెంట్ కూడా ఉంటుంది.

ఫస్టాఫ్‌ మొత్తం ఆ నలుగురు చుట్టూ తిరుగుతుంది. తినడం,తిరగడం, తాగడం అనే సీన్లతోనే ఫస్ట్ హాఫ్ నడుస్తుంది. అయితే ద్వితీయార్థం వచ్చే సరికి కాస్త కథనం మారుతుంది. చేజింగ్ సీన్లు, అడల్ట్ సీన్లు ఎక్కువగా వస్తుంటాయి. చివర్లో ఓ ట్విస్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. కానీ రెగ్యులర్ సినిమా క్లైమాక్స్ మాదిరిగా కాకుండా రియాల్టీకి దగ్గరగా ఉండేలా చేశాడు. అక్కడే దర్శకుడి టేస్ట్ కనిపిస్తుంది.

సాంకేతికంగా ఈ సినిమా మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ నాచురల్‌గా అనిపిస్తుంది. డైలాగ్స్‌ సహజంగానే వచ్చినట్టుగా అనిపిస్తాయి. పాటలు పర్వాలేదనిపిస్తాయి. బూతు డైలాగ్‌లకు బీప్‌ సౌండ్‌లు పడ్డాయి. ఎడిటింగ్‌ పర్వాలేదనిపిస్తుంది. నిడివి తక్కువగా ఉండటం కలిసి వచ్చే అంశం. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments