HomeGallery‘వెయ్ దరువెయ్’లో సాయి రామ్ శంకర్ ఫుల్ ఎనర్జీని చూడబోతోన్నారు.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హరీష్...

‘వెయ్ దరువెయ్’లో సాయి రామ్ శంకర్ ఫుల్ ఎనర్జీని చూడబోతోన్నారు.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హరీష్ శంకర్

‘వెయ్ దరువెయ్’లో సాయి రామ్ శంకర్ ఫుల్ ఎనర్జీని చూడబోతోన్నారు.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హరీష్ శంకర్

సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద దేవరాజు పొత్తూరు నిర్మించిన చిత్రం ‘వెయ్ దరువెయ్’. లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో వస్తున్న ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతల్ని నవీన్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. వెయ్ దరువెయ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘కేవీఆర్ గారు మాట్లాడితే నేరుగా గుండెకు తాకుతోంది. ఇంత తక్కువ టైంలో నిర్మాత దేవరాజ్ గారు, దర్శకుడు నవీన్ రెడ్డి గారు ఈ సినిమాను గొప్పగా తీశారు. సాయి రామ్ శంకర్ నాకు బ్రదర్ లాంటి వాడు. అతని ఫుల్ ఎనర్జీని ఈ చిత్రంలో చూడబోతోన్నారు. ఈ సినిమాలోని పాటలు, లిరిక్స్ బాగున్నాయి. భీమ్స్ మంచి పాటలే కాదు.. మంచి మాటలు కూడా మాట్లాడతాడని తెలిసింది. ఈ సినిమాలో కామారెడ్డి నుంచి హీరో వస్తాడు. కానీ కామారెడ్డి నుంచి హీరోలే వస్తారని కేవీఆర్ గారు నిరూపించారు. మార్చి 15న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయాలి’ అని అన్నారు.

కామారెడ్డి ఎమ్మెల్యే కేవీ రమణా రెడ్డి మాట్లాడుతూ.. ‘తక్కువ డబ్బుతో ఎక్కువ ఆనందాన్ని సినిమా ఇస్తుంది. సినిమా అనేది వ్యసనం కాదు. హరీష్, మాలా శ్రీ ప్రేమ ఖైదీ సినిమా కోసం ఆడిషన్స్‌కి వెళ్లాను. ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్ వంటి హాస్యనటులంటే నాకు చాలా ఇష్టం. ఒక సినిమా హిట్టయితే ఎన్నో కుటుంబాల్లో సంతోషం నిండుతుంది. వచ్చిన సక్సెస్‌ను కాపాడుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. నన్ను ఈవెంట్‌కు పిలిచినందుకు థాంక్స్. సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు.

నిర్మాత దేవరాజ్ మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన హరీష్ శంకర్ గారికి, కేవీఆర్ గారికి థాంక్స్. మా సినిమా మార్చి 15న రాబోతోంది. అందరూ చూసి విజయాన్ని అందించాలి’ అని అన్నారు.

డైరెక్టర్ నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన హరీష్ శంకర్ గారికి, కేవీఆర్ గారికి థాంక్స్. కథ చెప్పిన వెంటనే నిర్మాత దేవరాజ్ గారు ఓకే చెప్పారు. సాయి రామ్ శంకర్ గారు మా చిత్రానికి ఎంతో కష్టపడ్డారు. మార్చి 15న ఈ మూవీ రాబోతోంది. ఆడియెన్స్ అంతా మా సినిమాను చూడండి’ అని అన్నారు.

సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ.. ‘మా సినిమా ఈవెంట్‌కు గెస్టులుగా వచ్చిన కేవీఆర్ గారు, హరీష్ శంకర్ గారికి థాంక్స్. కమర్షియల్‌గా తీసిన ఈ సినిమాకు భీమ్స్ మంచి పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీను అన్నకి మంచి పాత్ర దొరికింది. సత్యం రాజేష్‌ను మేం బాగా ఇబ్బంది పెట్టాం (నవ్వుతూ). మా నిర్మాతకు సినిమాలంటే ప్యాషన్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. బంపర్ ఆఫర్, అమ్మనాన్న ఓ తమిళమ్మాయి లాంటి ఎమోషన్స్‌తో ఈ సినిమా ఉంటుంది. చాలా తక్కువ టైంలో ఈ సినిమాను దర్శకుడు అద్భుతంగా తీశారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మార్చి 15న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ.. ‘ధమాకా కంటే ముందే ఈ సినిమాను చేశాను. ట్రైలర్‌లో అసలు కథను రివీల్ చేయలేదు. చాలా ఎమోషనల్‌గా సినిమా ఉంటుంది. రీ రికార్డింగ్‌లో బిజీగా ఉంటే.. సాయి రామ్ శంకర్, దర్శకులు వచ్చి ఈవెంట్‌కు రావాలని అన్నారు. నా సినిమా కదా? పిలవకపోయినా వస్తాను.. ఏదో పేరు వచ్చింది కదా? అని రాకుండా ఉంటానా? ఏం లేనప్పుడు మీరు నాకు అవకాశం ఇచ్చారు. నన్ను నమ్మి వచ్చిన వాళ్లకి నమ్మకంగా పని చేస్తాను. మార్చి 15న ఈ చిత్రం రాబోతోంది. సాయి రామ్ శంకర్ ఈ సినిమాను భుజానికెత్తుకుని పని చేశారు. నాకు అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాత హీరోలకు థాంక్స్’ అని అన్నారు.

సత్యం రాజేష్ మాట్లాడుతూ.. ‘మా డైరెక్టర్ ఈ సినిమా కథను ఎంత అలవోకగా చెప్పాడో.. అంతే అలవోకగా సినిమాను తీశాడు. దేవరాజ్ ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాత. సాయి రామ్ శంకర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మార్చి 15న మా చిత్రం రాబోతోంది. అందరూ ఆశీర్వదించండి’ అని అన్నారు.

ప్రభాస్ శీను మాట్లాడుతూ.. ‘నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సాయి రామ్ శంకర్ చూడటానికి సున్నితంగా కనిపిస్తాడు. కానీ లోపల మాస్ ఉంటుంది. ఈ సినిమాతో సాయి రామ్ శంకర్ మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటీనటులు : సాయిరామ్ శంకర్, యషా శివకుమార్, హెబ్బా పటేల్, సునీల్, సత్యం రాజేష్, దేవరాజ్ పొత్తూరు, ప్రభాస్ శ్రీను, కాశీ విశ్వనాథ్, పోసాని కృష్ణ మురైల్, రోలర్ రఘు, 30 ఏళ్ల పృధ్వి, చమక్ చంద్ర, వియోంద్ విజయన్, మిర్చి మాధవి, శృతి సమన్వి తదితరులు

సాంకేతికబృందం
బ్యానర్ : సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత : దేవరాజు పొత్తూరు
సమర్పణ : లక్ష్మీనారాయణ పొత్తూరు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : నవీన్ రెడ్డి
సంగీత దర్శకుడు : భీమ్స్ సిసిరోలియో
డిఓపి : సతీష్ ముత్యాల
ఎడిటర్ : ఎస్‌బీ ఉద్ధవ్
పీఆర్వో : దుద్ది శ్రీను
డిజిటల్ : మూవీ ప్రమోషన్
డిఐ : ప్రసాద్ ల్యాబ్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత : శ్రీపాల్ చొల్లేటి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments