లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్‌హాసన్, ఫాహద్ ఫాజిల్, విజయ్‌సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విక్రమ్’. ఈ చిత్రంలో సూర్య గెస్ట్ రోల్ చేశారు. ఈ ఏడాది జూన్ 3న విడుదలైన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ కోలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించాయి. ప్రపంచవ్యాప్తంగా విక్రమ్ సినిమా 432.50 కోట్ల వసూళ్లను రాబట్టి కోలీవుడ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తమిళంలోనే విక్రమ్ సినిమా 307.60 కోట్ల రూపాయాల వసూళ్లను రాబట్టింది. ఇలా తమిళ సినీ పరిశ్రమలో హాయ్యెస్ట్ వసూళ్లు రాబట్టిన చిత్రంగా విక్రమ్ నిలిచింది. ఈ సినిమాను దాదాపు కోటిమందికి పైగా వీక్షించారట. 2010లో వచ్చిన రజనీకాంత్ ‘రోబో’ సినిమా తర్వాత ప్రేక్షకుల నుంచి ఓ తమిళ సినిమాకు ఇంత స్థాయిలో ఆదరణ లభించింది విక్రమ్ సినిమాకే కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా హాయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన తమిళ సినిమా కూడా విక్రమ్యే.
తమిళం భాషలో విడుదలైన ‘విక్రమ్’ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 373 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక అన్ని వెర్షన్స్ (తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడం, విదేశీ భాషలు) కలుపుకుంటే మాత్రం కలెక్షన్స్ విషయంలో ‘విక్రమ్’ది సెకండ్ ప్లేస్‌గా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘2.0’ తొలి స్థానంలో ఉంది. ఈ సినిమాకు అన్నీ భాషలు, విదేశీ రిలీజ్‌లతో కలుపుకుని దాదాపు 665 కోట్ల రూపాయాలను వసూలు చేసింది. ఈ విషయంలో విక్రమ్ సినిమా మాత్రం 432.50 కోట్ల రూపాయలతోనే సరిపెట్టుకుంది. ఇలా కలెక్షన్స్ పరంగా కోలీవుడ్‌లో ‘విక్రమ్’ సినిమా నెంబర్ 1గా, అన్నీ వెర్షన్స్‌తో కలుపుకున్నప్పుడు నెంబర్ 2గా నిలిచి కోలీవుడ్‌లో సరికొత్త రికార్డులను సృష్టించింది.
ప్రస్తుతం దర్శకుడు శంకర్‌తో కలిసి కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’ సినిమా చేస్తున్నాడు. కమల్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’(1996) సినిమాకు ఇది సీక్వెల్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్
చేయాలనుకుంటున్నారు. ఇటు లోకేష కనగరాజ్ కూడా తమిళ స్టార్ హీరో విజయ్‌తో మరో సినిమా
చేయడానిక రెడీ అయ్యాడు. ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్స్‌లో ఉన్నాడు. ‘మాస్టర్’ తర్వాత విజయ్, లోకేష్ కాం
బినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. ప్రజెంట్ విజయ్ ‘వారిస్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. వంశీ
పైడిపల్లి ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే లోకేష్‌తో సినిమా స్టార్ట్ చేస్తాడు
విజయ్. వారిస్ తెలుగులో ‘వారసుడు’గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి ఈ చిత్రం
విడుదల అవుతుంది.