HomeOTTఈ వారంలో ఓటీటీ చిత్రాలు... మరి థియేటర్‌లో వచ్చే సినిమాలు ఇవే!

ఈ వారంలో ఓటీటీ చిత్రాలు… మరి థియేటర్‌లో వచ్చే సినిమాలు ఇవే!

మరో రెండు వారాల్లో దసరా సందడి మొదలు కానున్న నేపథ్యంలో చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిన్న సినిమాలన్నీ బాక్సాఫీస్‌కు క్యూ కట్టాయి. మరి థియేటర్‌లో ఎవరెవరు అలరించడానికి సిద్ధమయ్యారు? అలాగే ఓటీటీ లో ఎలాంటి ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి? చూసేయండి.

                                              విభిన్న నేపథ్యంతో..

Maama Mascheendra (2023) - IMDb

సుధీర్‌బాబు కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై రూపొందిన చిత్రం ‘మామ మశ్చీంద్ర’. హర్షవర్ధన్‌ దర్శకుడు. నారాయణదాస్‌ కె.నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ‘మామ మశ్చీంద్ర’ తీర్చిదిద్దారు.

                                కిరణ్‌ అబ్బవరం నుంచి మరో సినిమా

Rules Ranjann (2023) - IMDb

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్న యువ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం. నేహాశెట్టితో కలిసి ఆయన నటించిన తాజా చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దివ్యాంగ్‌ లవానియా, మురళీకృష్ణ వేమూరి నిర్మాతలు. ఏఎం రత్నం సమర్పకులు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 6న విడుదల కానుంది. కుటుంబ ప్రేక్షకులతోపాటు యువతరాన్ని ఆకట్టుకునేలా ‘రూల్స్‌ రంజన్‌’ను తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం తెలిపింది.

                               అందర్నీ ఆశ్చర్యపరిచేలా..

Month of Madhu (2023) - IMDb

నవీన్‌ చంద్ర, స్వాతి ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్‌ నాగోతి తెరకెక్కించిన చిత్రం ‘మంత్‌ ఆఫ్‌ మధు’. యశ్వంత్‌ ములుకుట్ల నిర్మాత. సుమంత్‌ దామ సహ నిర్మాత. ఈ సినిమా అక్టోబరు 6న విడుదల కానుంది. భావోద్వేగాలే కీలకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది.

                                        యువతరమే.. ‘మ్యాడ్‌’ లక్ష్యం

Mad Movie 2023 Release Date, Cast, Plot, Teaser, Trailer and More

నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రల్లో కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మ్యాడ్‌’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సునీల్‌కుమార్‌, గోపికా ఉద్యన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంజినీరింగ్‌ కాలేజీ నేపథ్యంలో సాగే ఓ విభిన్న కథాంశంతో దీన్ని ముస్తాబు చేశారు. అక్టోబరు 6న థియేటర్‌లలో ఈ చిత్రం విడుదల కానుంది.

                                     ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథ

800 (2023) - IMDb

శ్రీలంక జట్టు మాజీ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘800’. మురళీ పాత్రలో మధుర్‌ మిట్టల్‌ నటించగా, ఆయన భార్య మదిమలర్‌ పాత్రలో మహిమా నంబియార్‌ నటించారు. ఎం.ఎస్‌.శ్రీపతి దర్శకుడు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో అక్టోబరు 6న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, సింహళీ భాషల్లో విడుదలవుతోంది. టెస్ట్‌ క్రికెట్‌లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌ ముత్తయ్య మురళీధరన్‌ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

జాతర రద్దీని చిన్నా తట్టుకోగలడా

సిద్ధార్థ్‌, అంజలీ నాయర్‌, నిమిష సజయన్‌ కీలక పాత్రల్లో ఎస్‌యూ అరుణ్‌కుమార్‌ రూపొందించిన మలయాళ చిత్రం ‘చిత్త’. తెలుగులో ‘చిన్నా’ పేరుతో అక్టోబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అక్కడ విడుదలైన ఈ సినిమా అక్కడ మంచి టాక్‌ తెచ్చుకుంది. మరి తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

ఈ వారం ఓటీటీల అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

నెట్‌ఫ్లిక్స్‌

  • బెక్‌హమ్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 4
  • మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి (తెలుగు) అక్టోబరు 5
  • ఎవ్రీథింగ్‌ నౌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 5
  • ఖుఫియా (హిందీ) అక్టోబరు 5
  • లుపిన్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 5
  • ఫెయిర్‌ ప్లే (హాలీవుడ్) అక్టోబరు 6
  • ఇన్సిడియస్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 6
  • స్ట్రాంగ్‌ గర్ల్‌ నామ్‌-సూన్‌ (కొరియన్‌) అక్టోబరు 6

అమెజాన్‌ ప్రైమ్‌

  • హర్కరా (మలయాళం) అక్టోబరు 1
  • ముంబై డైరీస్‌ (హిందీ) అక్టోబరు 6

జీ5

  • గదర్‌2 (హిందీ) అక్టోబరు 6

డిస్నీ+హాట్‌స్టార్‌

  • హంటెడ్‌ మాన్షన్‌ (హలీవుడ్‌) అక్టోబరు 4
  • లోకి (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 6

ఆహా

  • మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ (తెలుగు) అక్టోబరు 6
  • ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌ (తెలుగు) అక్టోబరు 6

బుక్‌ మై షో

  • ది నన్‌ 2 (హాలీవుడ్‌) అక్టోబరు 3
  • గ్రాన్‌ టురిస్‌మో (హాలీవుడ్‌) అక్టోబరు 5
  • ఆస్ట్రరాయిడ్‌ సిటీ (హాలీవుడ్‌) అక్టోబరు 6

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments