HomeGossipsPrabhas: డార్లింగ్ కి విదేశాల్లో అన్ని ఆస్తులా...!

Prabhas: డార్లింగ్ కి విదేశాల్లో అన్ని ఆస్తులా…!

ఈ మధ్య కాలంలో తన సినిమాలతో దేశాన్నే ఊపేస్తున్న నటుడు యంగ్ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. భారతదేశంలోనే అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న ఇద్దరు ముగ్గురు హీరోల్లో డార్లింగ్ ఒకడు అనడంలో అతిశయోక్తి లేదు. బాహుబలిలో తన నటనతో ప్రపంచ స్థాయి నటుడిగా మారిపోయాడు. బాలివుడ్ ఖాన్స్ త్రయంతో సమానంగా, ఇంకా చెప్పాలంటే కొన్ని సినిమాలకు వాళ్ల కంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అలా ఆయన ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ మూడు సినిమాలకు గాను ఆయన రెమ్యూనరేషన్ రూ.300 కోట్లకు పైమాటే. అలా వచ్చిన రెమ్యూనరేషన్ లో కొంత భాగాన్ని ఇటలీలో కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టాడట. అంతే కాదు ఆయనకీ అక్కడ విల్లాలు మరియు ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ రెస్టారెంట్స్, కమర్షియల్ కాంప్లెక్స్ లు కూడా కట్టి, అద్దెకి ఇస్తున్నాడట. ఈ వ్యాపారాల విలువ కోట్లలోనే ఉంటుందని సమాచారం.ఇక తాను సేదతీరేందకు గాను ఓ విలాసవంతమైన, ప్రత్యేకమైన విల్లాను కట్టుకున్నాడట. అప్పుడప్పుడు ఖాళీ సమయాల్లో అక్కడి వెళ్లి ఉన్న టైం ను ఎంజాయ్ చేస్తున్నాడట. మొత్తం మీద ఆయన ఇటలీ లో ఉన్న ఆస్తుల వివరాలు మొత్తం లెక్కగడితే రూ.వెయి కోట్లకు పైగానే ఉంటుంది. ఇక వ్యాపారాల నుంచి ఆయనకు నెలకు రూ.వంద కోట్ల వరకు ఆదాయం వస్తుందని, సినిమా ద్వారా వచ్చే డబ్బు కంటే కూడా, వ్యాపారాల నుంచి వచ్చే డబ్బే ఎక్కువని, ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ లో డబ్బు సంపాదిస్తున్న హీరోయిన్ ఇండస్ట్రీలో లేరని అంటున్నారు విశ్లేషకులు.ఇక ప్రభాస్ లేటెస్ట్ గా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాన్ని దక్కించుకోలేక పోయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆ చిత్రం రూ.350కోట్లకు పైగానే గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఫుల్ రన్ లో ఎంత వరకు రాబడుతుందో చూడాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments